Srikara Shubakara Lakshmi Narasimha Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Srikara Shubakara Lakshmi Narasimha Song Lyrics
నరసింహా లక్ష్మీ నరసింహా
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా లక్ష్మీ నరసింహా
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా లక్ష్మీ నరసింహా
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా
నీవే శరణమయా ఓ యాదగిరీ నరసింహా
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా లక్ష్మీ నరసింహా
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా
పురాణ యుగమున ఈ గిరి పైనే తపమొనరించెను యాద రిషి
ధరాతలమ్మున అతని పేరుతో అయ్యింది ఈ గిరి యాదగిరి
ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు
భక్త అభీష్టములు అన్నియు తీర్చే లక్ష్మీ నరసింహుడు
సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు
సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు
నమో నమః నమో నమః
నమస్కరించెను నాలుగు దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు
గోకుల రూపము దాల్చినది ఆ దివ్య సుదర్శన చక్రము
మంగళ హారతులు ఇచ్చినది మహా కాల చక్రము
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా లక్ష్మీ నరసింహా
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా
ఈ స్వామి పదములు బ్రహ్మ కడుగగా విష్ణు గుండమే ప్రవహించే
ఇట స్నానము చేసిన జన్మ ధన్యమే కర్మ విమోచనమే
ఇక విశ్వ వైద్యుడై స్వామియే చేయును రోగ నివారణమే
చిత్తము దేహము సత్వముగా నవు బెత్తము తాకగనే
భోగ భాగ్యాలు దీర్ఘాయువు ఒసగెను గిరి ప్రదక్షిణం
భోగ భాగ్యాలు దీర్ఘాయువు ఒసగెను గిరి ప్రదక్షిణం
నమో నమః నమో నమః
క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే సాక్షి ఔను ఈ మహిమలకు
కలియుగ దైవము యాదగిరి శ్రీ నరసింహుని దర్శనము
కోరిన కోర్కెలు తీర్చేటి మహా కల్ప వృక్షము
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా లక్ష్మీ నరసింహా
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా
భూత ప్రేత పిశాచ రాక్షసుల ప్రారద్రోలు నీ నామమే
క్షుద్ర శక్తులను బాణామతులను దగ్దమొనర్చు నీ స్మరణమే
ప్రపంచ బాల ప్రహ్లాదునియే హిరణ్యకశిపుడు హింసింపగనే
సర్వ కాలముల సర్వ అవస్తల సర్వ దిక్కులకు వ్యాపించి సంరక్షింపుము నరసింహా అనుగ్రహింపుము నరసింహా యాదగిరీశా నరసింహ
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా లక్ష్మీ నరసింహా
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా
You May Also Like
» Andhamaa Andhamaa [Hesham Abdul Wahab, Aavani Malhar] » Chanuvuga Chusina [Asura, Feroz Israel, Nawab Gang] » Rangu Rangu [Sameera Bharadwaj] » Mallanna Komaravelli mallanna [Pritam, Sonu Nigam, Bhaskarabhatla] » Aradhya Epic Mix [Maa Little Stars] » Raa Chilaka [Sid Sriram] » Aghajalmula Paradrola Sri Narasimha [Pastor Leena Shashi] » Wherever You Go [Armaan Malik, Anila Rajeev]FAQs for Srikara Shubakara Lakshmi Narasimha
Who is the music director of Srikara Shubakara Lakshmi Narasimha song ?
Srikara Shubakara Lakshmi Narasimha is Tuned by Usha, Mallampalli Subramanya Sharma.
Which label release Srikara Shubakara Lakshmi Narasimha song ?
Srikara Shubakara Lakshmi Narasimha is released under the label of Sri Lakshmi Narasimha Swamy Amruthavarshini.
Whats the playtime (duration) of Srikara Shubakara Lakshmi Narasimha song ?
Playtime of song Srikara Shubakara Lakshmi Narasimha is 22:12 minute.
How can I download Srikara Shubakara Lakshmi Narasimha song ?
You can download Srikara Shubakara Lakshmi Narasimha song via click above download links.